![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -1081 లో... ఇదంతా మా ప్లాన్ అని మహేంద్ర అనగానే. శైలేంద్ర షాక్ అవుతాడు. నన్ను ఇంత మోసం చేస్తారా? అసలు కాలేజీ కోసం వీడు యాభై కోట్లు ఇవ్వలేదని శైలేంద్ర అంటాడు. ఆ విషయం కూడా తెలుసు.. అసలు అప్పే లేదు.. అది నువ్వే క్రియేట్ చేసావన్న విషయం కూడా తెలుసని మహేంద్ర అంటాడు.
చెప్పుకోవడానికి నేను విలన్ కానీ నా కంటే పెద్ద విలన్ లా ఉన్నారు. ఒకరికి ముగ్గురు అయ్యారని శైలేంద్ర అంటాడు. నేనే కావాలనే ఆ రాజీవ్ ని పట్టించానని తెలిస్తే నా పరిస్థితి ఏంటని శైలేంద్ర అంటాడు. నువ్వు ఏదైనా ఎక్సట్రా చేస్తే ఆ విషయం మేమే రాజీవ్ కి చెప్తామని మను అంటాడు. ఎప్పుడైనా నేను మా బావకి చెప్తానని వసుధార అంటుంది. ఆ తర్వాత వసుధార, మను, మహేంద్ర ఇచ్చిన షాక్ కి శైలేంద్ర దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయి ఫుల్ గా డ్రింక్ చేసి షూస్ చేతిలో పట్టుకొని వస్తుంటాడు. ఊగుతు వస్తు మెట్లపై పడిపోతాడు. ధరణి వచ్చి దేవయానిని పిలుస్తుంది. ఏమైందని దేవాయని టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత ధరణి, దేవాయనిలు శైలేంద్రపై వాటర్ పోస్తారు. అయిన శైలేంద్ర తలతిక్కగా మాట్లాడుతుంటే.. వాళ్ళకేం అర్థం కాదు. మరొకవైపు మనం ఇచ్చిన షాక్ తో శైలేంద్ర లో ఎంతో కొంత మార్పు వచ్చి ఉంటుందని మహేంద్ర అంటాడు. అలా అనుకోకుడదు.. ఇప్పుడు మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలని వసుధార అంటుంది. మీరు రిస్క్ చేసి కాపడకుంటే నా పరిస్థితి ఏంటని మను అంటాడు. నాకు శిక్ష పడుతుందని కాదు నా తండ్రి గురించి తెలియకుండా శిక్ష పడుతుందా అని భయం ఉందని మను అనగానే.. కేసులో నుండి బయట పడ్డందుకి హ్యాపీగా ఉండాలి కానీ ఎప్పుడు అదే ఆలోచనన అని అనుపమ సీరియస్ అవుతుంది. నా తండ్రి ఎవరో తెలిస్తే ఎందుకు మాకు ఇంత అన్యాయం చేసావని అడుగుతానని మను అంటాడు. ఇక నీ ఆలోచన వైఖరి మార్చుకోమని అనుపమ చెప్తుంది.
మరోవైపు శైలేంద్ర దగ్గరికి దేవయాని వచ్చి.. చెంప చెల్లుమనిపిస్తుంది. ఎందుకు కొడుతున్నావని శైలేంద్ర అంటాడు. గుడ్ న్యూస్ అని చెప్పి బ్యాడ్ న్యూస్ చెప్తావా అని దేవయాని అంటుంది. నేను నీకు ఏం చెప్పలేదు కదా అని శైలేంద్ర అంటాడు. నీ మొహం చూస్తే తెలియట్లేదా అని దేవయాని అంటుంది. ఆ తర్వాత జరిగిందంతా దేవయానికి చెప్తాడు. మరొకవైపు జైల్లో రాజీవ్.. వసు గురించి ఆలోచిస్తుంటాడు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |